- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ధురంధర్-2' స్టోరీ నాదే.. కాపీ కొట్టారు: కన్నడ డైరెక్టర్
తన స్టోరీని కాపీ కొట్టి సినిమా తీశారని తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ మూవీ ధురంధర్ 2 ( Dhurandhar 2 ) సినిమా ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఉగాది సమయంలో విడుదలైన ఈ సినిమా, రూ. 1000 కోట్లను ఇప్పటికే దాటింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘటనలు.. నోట్ల రద్దు, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా సరికొత్త వివాదంలో చిక్కుకుంది.
తన స్టోరీని కాపీ కొట్టి సినిమా తీశారని తాజాగా కన్నడ దర్శకుడు ఆర్ఎస్ సంతోష్ కుమార్ ( Santosh Kumar RS ) సంచలన ఆరోపణలు చేశారు. 2023లోనే ఈ కథను రిజిస్టర్ చేయించానని తెలిపాడు. టీ-సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు ఈ కథ వినిపించానని ఆర్ ఎస్ సంతోష్ కుమార్ షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇటీవల సినిమా చూడడంతో అసలు విషయం తెలిసిపోయిందని వెల్లడించాడు. ఇక దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తానని హెచ్చరించారు సంతోష్ కుమార్.






