సంజయ్ సాహు తిరిగొస్తున్నాడోచ్.. జల్సా రీ రిలీజ్.. పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ‘జల్సా’(Jalsa) ఒకటి.

సంజయ్ సాహు తిరిగొస్తున్నాడోచ్.. జల్సా రీ రిలీజ్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సినిమాల్లో ‘జల్సా’(Jalsa) ఒకటి. త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇలియానా(Ileana) మరియు కమలినీ ముఖర్జీ(Kamalini Mukherjee) ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇందులో సంజయ్ సాహు పాత్రలో పవన్ కళ్యాణ్ తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అయితే ప్రజెంట్ టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో జల్సా సినిమా కూడా 4K క్వాలిటీతో డిసెంబర్ 31న సంక్రాంతి/న్యూ ఇయర్ స్పెషల్ కింద రీ-రిలీజ్ కానుంది. ఇది అభిమానుల కోసం పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా విడుదలవుతోంది. ఇది గతంలో సెప్టెంబర్ & మేలో కూడా రీ-రిలీజ్ అయినప్పటికీ, తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్ 31, 2025 న పెద్ద ఎత్తున 4K వెర్షన్‌లో విడుదలవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story