The Bhootnii: హర్రర్ యాక్షన్ అండ్ కామెడీ చిత్రం వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన సంజయ్ దత్

by sudharani |
The Bhootnii: హర్రర్ యాక్షన్ అండ్ కామెడీ చిత్రం వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన సంజయ్ దత్
X

దిశ, సినిమా: సంజయ్ దత్ (Sanjay Dutt), మౌనీ రాయ్ (Mouni Roy) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ది భూత్నీ’ (The Bhootnii). సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్ అండ్ త్రీ డైమెన్షన్ హోషన్ పిక్చర్ బ్యానర్‌లపై రూపొందుతున్న ఈ చిత్రంలో పాలక్ తివారీ, సన్నీ సింగ్, బియోనిక్, ఆసీఫ్ ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నూతన దర్శకుడు సిధాంత్ సచ్‌దేవ్ (Siddhant Sachdev) తెరకెక్కిస్తున్న ఈ మూవీ‌ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోనల్ వీడియోకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ హారర్ చిత్రంపై ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ పెరిగింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా.. ‘ది భూత్నీ’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు సంజయ్ దత్.

‘మనిషి ప్రేమ తేదీని నిర్ణయించగలడు.. కానీ దెయ్యం వచ్చే తేదీని కాదు.. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, అది ఆమెకు మాత్రమే తెలుసు! ఏప్రిల్ 18న వస్తుందని అనుకున్నారు కానీ ఇప్పుడు మే 1న వస్తోంది, సిద్ధంగా ఉండండి! హర్రర్ యాక్షన్ అండ్ కామెడీ చిత్రం ‘ది భూత్నీ’ ఇప్పుడు మే 1, 2025న థియేటర్లలోకి రానుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన VFX పని పూర్తి కానందున మూవీని పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. ఆలస్యంగా వస్తున్నప్పటికీ అత్యున్నత స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుందని హామీ ఇస్తున్నారు చిత్ర బృందం.



Next Story

Most Viewed