లోకేష్ కనగరాజ్ సినిమాలోకి మరో యంగ్ బ్యూటీ..

by Chukka Sudharani |

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Director Lokesh Kanagaraj)ప్రస్తుతం డైరెక్షన్‌కు బ్రేక్ ఇచ్చి.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

లోకేష్ కనగరాజ్ సినిమాలోకి మరో యంగ్ బ్యూటీ..
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Director Lokesh Kanagaraj)ప్రస్తుతం డైరెక్షన్‌కు బ్రేక్ ఇచ్చి.. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా మొదలవగా.. తాజాగా ఈ సినిమాలో మరో బ్యూటీ జాయిన్ అయినట్లు తెలుస్తుంది. ‘DC’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్ దేవదాసుగా కనిపించనుండగా.. ఆయనకు జోడీగా చంద్ర పాత్రలో బాలీవుడ్ బ్యూటీ వామిక గబ్బి(Vamika Gabbi) నటించనుంది. అరుణ్ మాతేశ్వరన్(Director Arun Matheswaran) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా టీజర్ రిలీజ్ చేయగా.. ముఖమంతా రక్తంతో కనిపించి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు లోకేష్. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో మరో బ్యూటీ సంజన (Sanjana) జాయిన్ అయినట్లు టాక్. ‘లబ్బర్ పండు, థగ్ లైఫ్’ వంటి సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు DC మూవీలో నటించబోతున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నా ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. డిసెంబర్ చివరి నాటికి లేదా వచ్చే ఏడాది జనవరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేయాలని బృందం యోచిస్తోందని తెలుస్తుంది.

Next Story