Sandeep Reddy Vanga: హాట్ టాపిక్‌గా మారిన డైరెక్టర్ ట్వీట్.. ఇదే మీ ఫెమినిజమా అంటూ మాస్ వార్నింగ్.. దీపికాను ఉద్దేశించేనా?

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-27 11:55:49  IST  )

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

Sandeep Reddy Vanga: హాట్ టాపిక్‌గా మారిన డైరెక్టర్ ట్వీట్.. ఇదే మీ ఫెమినిజమా అంటూ మాస్ వార్నింగ్.. దీపికాను ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. రెండు బ్లాక్ బస్టర్ హిట్స్‌తో స్టార్ డైరెక్టర్‌గా మారిన ఆయన ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas)తో ‘స్పిరిట్’(Spirit) చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్‌ విషయంలో గత కొద్ది కాలంగా వివాదం కొనసాగుతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొణె(Deepika Padukone)ను సెలెక్ట్ చేయగా.. ఆమె అధిక మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడంతో తొలగించి త్రిప్తి డిమ్రిని కన్ఫర్మ్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే సందీప్ రెడ్డి వంగా ఓ సంచలన ట్వీట్ చేయడంతో అది కాస్త హాట్ టాపిక్‌గా మారింది.

తాజాగా, సందీప్ రెడ్డి వంగా ట్విట్టర్ ద్వారా ఓ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన పీఆర్ టీమ్ తన ‘స్పిరిట్’ మూవీకి సంబంధించిన స్టోరీని లీక్ చేసే ప్రయత్నాలు చేస్తోందంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా డర్జీపీఆర్ గేమ్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ పెట్టారు. ‘‘ఇటీవల నేను ఓ స్టార్ హీరోయిన్‌కు స్టోరీ చెప్పాను. వందశాతం నమ్మకంతో ఆమెకు వివరించాను. దర్శకులు నటీనటులకు కథ నెరేట్ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ ఉన్నట్లే లెక్క. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక యంగ్ హీరోయిన్ ఎదగకుండా చేయడం ఎంతో కష్టపడి రాసుకున్న నా కథను లీక్ చేయడం ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? దర్శకుడిగా నేను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాను. నాకు సినిమానే ప్రపంచం. ఎప్పటికీ దీన్ని మీరు. అర్థం చేసుకోలేరు. కావాలంటే.. నా స్టోరీని మొత్తం లీక్ చేయండి. నేనం భయపడను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇది చూసిన వారంతా ఈ పోస్ట్ ఆయన దీపికా పదుకొణెను ఉద్దేశించే చేశాడని అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా చెప్పేది ఆమె గురించే అని చర్చించుకుంటున్నారు.

Next Story