తొలి ప్రేమ అంత తోపేం కాదు.. ఈ సినిమా ఫస్ట్ లవ్ గురించి కాదు.. సరైన లవ్ స్టోరీ గురించి.. సందీప్ రెడ్డి వంగ ట్వీట్ వైరల్

by Sujitha Rachapalli |

సందీప్ రెడ్డి వంగ సినిమా లవర్. కల్ట్ మూవీస్ లోడ్ చేసే సత్తా ఉన్న దర్శకుడు. జస్ట్ రెండు సినిమాలతోనే విమర్శకుల నోరు మూయించిన డైరెక్టర్. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్‌తో తానేంటో నిరూపించిన సందీప్.. ప్రభాస్‌తో చేయబోతున్న స్పిరిట్‌తో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

తొలి ప్రేమ  అంత తోపేం కాదు.. ఈ  సినిమా ఫస్ట్ లవ్ గురించి కాదు.. సరైన లవ్ స్టోరీ గురించి.. సందీప్ రెడ్డి వంగ ట్వీట్ వైరల్
X

దిశ, ఫీచర్స్ : సందీప్ రెడ్డి వంగ సినిమా లవర్. కల్ట్ మూవీస్ లోడ్ చేసే సత్తా ఉన్న దర్శకుడు. జస్ట్ రెండు సినిమాలతోనే విమర్శకుల నోరు మూయించిన డైరెక్టర్. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్‌తో తానేంటో నిరూపించిన సందీప్.. ప్రభాస్‌తో చేయబోతున్న స్పిరిట్‌తో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇన్ని రోజులు ఈ సినిమా వివాదం గురించి ట్వీట్స్ వేసిన ఈ దర్శకుడు.. తాజాగా మరో సినిమా గ్లింప్స్ గురించి పోస్ట్ పెట్టాడు. ప్రశంసలు కురిపించాడు. ‘‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫస్ట్ లవ్ గురించి కాదు రైట్ లవ్ స్టోరీ గురించి.. టైటిల్, ఫిల్మ్ కాన్సెప్ట్ నచ్చింది. ప్రేమ నిజంగానే అన్ఎక్స్‌పెక్టెడ్ వేస్‌లో మన దగ్గరకు చేరుతుంది’ అంటూ మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెప్పాడు.

బేబీ డైరెక్టర్ సాయి రాజేష్, కిరణ్ అబ్బవరం కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రానికి ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేస్తూనే.. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ‘మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి కథలూ తల్లి ప్రేమ దగ్గరే ఆగిపోవాలి కదండీ.. అమ్మే కదండీ.. మనందరి ఫస్ట్ లవ్! చరిత్రలో ఎన్నో గొప్ప ప్రేమ కథలున్నాయి.. వాళ్లందరికీ అవి మొదటి ప్రేమలైతే కాదు కదా! ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందని.. ఒకే చోట కదలకుండా కూర్చుంటే కాసేపు తరువాత కాలు కూడా తిమ్మిరెక్కుద్ది! మనసు కూడా అంతేనండీ.. ఒక్కసారి కదిపి చూడండి.. మెల్లగా అడుగులేస్తూ అదే పరిగెడుతుంది.. అంతేగానీ...వాడెవడోజజ తొలిప్రేమ, నా సమాధి, బొచ్చూ బోషాణం అంటే.. దాన్ని పట్టుకొని కూర్చుంటారేంటండి? అలా అయితే నేనూ చాలా చెప్తా.. ఏమని?? ‘‘తొలిప్రేమ అంత తోపేం కాదని’’’ అంటూ సాగిన హీరో హీరోయిన్ల కన్వర్జేషన్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి మూవీ గ్లింప్స్ ఆకట్టుకోగా.. బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటున్నారు మూవీ లవర్స్.

Next Story