Sandeep Reddy: వారు లేకుండా మూవీ తీస్తానంటూ బిగ్ ఛాలెంట్ విసిరిన ప్రముఖ దర్శకుడు..!

by Anjali |
Sandeep Reddy: వారు లేకుండా మూవీ తీస్తానంటూ బిగ్ ఛాలెంట్ విసిరిన ప్రముఖ దర్శకుడు..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎంట్రీ ఇవ్వడమే బ్లాక్ బస్టర్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను హీరోగా చూపించి.. యువతను ఫిదా చేశాడనడంలో అతిశయోక్తిలేదు. అయితే ముందుగా అర్జున్ రెడ్డి చిత్రం కోసం నటుడు శర్వానంద్‌ (Sharwanand)ను అప్రోచ్ అయ్యాడట దర్శకుడు సందీప్ వంగా.

కానీ శర్వానంద్ వేరే చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉండటంతో విజయ్ దేవరకొండకు అవకాశం ఇచ్చారని సోషల్ మీడియాలోని టాక్. అలాగే ఈ మూవీని నిర్మించడానికి ఏ ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాలేదట. దీంతో సందీప్ రెడ్డి వంగా ఫాదర్ అండ్ బ్రదర్ కలిసి భద్రకాళి పిక్చర్స్ (Bhadrakali Pictures) అనే నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి.. అర్జున్ రెడ్డి మూవీని నిర్మించారట. ఈ మూవీ 2017 లో థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయి.. కాసుల వర్షం కురిపించింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అంతేకాకుండా చిత్ర యూనిట్‌కు మంచి పేరు దక్కించింది. రూ. 5 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఏకంగా ఎవరూ ఊహించని విధంగా రూ. 50 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. తర్వాత ఈ దర్శకుడు కబీర్ సింగ్ తెరకెక్కించాడు. అనంతరం రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అండ్ రష్మిక మందన్న (Rashmika) హీరోహీరోయిన్‌లుగా చూపించి.. యానిమల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ మూవీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పాల్సిన అక్కర్లేదు.

ఎమోషన్ సీన్స్, ఓ వైప్ బోల్డ్ సీన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్.. ఇలా ప్రతి ఒక్క సన్నివేశం నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఇకపోతే సందీప్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సాంగ్ లేకుండా మూవీ తెరకెక్కిస్తారా? లేదా కథానాయకుడు లేకుండా సినిమా తీస్తారా? అని అడగ్గా.. డైరెక్టర్ వెంటనే ఏం థింక్ చేయకుండా హీరో లేకుండా మూవీ తీస్తానని బదులిచ్చాడు.

అలాగే తన సినిమాలంటే ఇష్టపడని మహిళలు హీరో లేకుండా మూవీ తీస్తే కూడా ఇష్టపడరు అని అన్నాడు. ఇది నేను రాసిస్తానని వెల్లడించాడు. కానీ పక్కా ఇంకో నాలుగైదు ఏళ్లలో కథానాయకుడు లేకుండా మూవీ తెరకెక్కిస్తానని బిగ్ ఛాలెంట్ విసిరాడు. ప్రెజెంట్ ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీస్తున్నాడు.



Next Story

Most Viewed