- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘స్పిరిట్’ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా.. ఇంటర్నేషనల్ లెవెల్ ఉండబోతుందా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) పలు భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) పలు భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. అయితే డార్లింగ్, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’(Spirit). ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన సంగీత చర్చలు కూడా స్టార్ట్ అయ్యారు. ఈ చిత్రం కోసం హర్షవర్ధన్ రామేశ్వర స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటం విశేషం. దీంతో ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా.. అప్డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను స్పిరిట్ అప్డేట్ ఇవ్వాలంటే.. ప్రస్తుతం మెక్సికోలో లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నాం. త్వరలో అక్కడే షూటింగ్ మొదలుపెడతాం. ఈ ఈవెంట్ అయ్యాక నేను వెంటనే హైదరాబాద్‌కు వెళ్లాలి’’ అని చెప్పుకొచ్చారు. ఇక సందీప్ రెడ్డికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెక్సికో అంటే ఫారెన్ పోలీస్ క్యారెక్టర్‌లో ప్రభాస్ కనిపించబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక లోకల్ పోలీస్ అనుకుంటే.. సందీప్ భలే ప్లాన్ చేశాడని ఫస్ట్ షెడ్యూలే ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంటుంది కావచ్చని చర్చించుకుంటున్నారు.
#PRABHAS - BIGGEST FILM - #Spirit Shoot going to Start in MEXICO - #SandeepReddyVanga 🥵🥵🥵💥💥💥#SandeepVanga Planned INTERNATIONAL level First Schedule ✅
— GetsCinema (@GetsCinema) March 30, 2025
pic.twitter.com/WjMSfbwvYX






