సందీప్ రెడ్డి కొత్త‌ సినిమా.. హీరో ఎవ‌రంటే?

by velandi.Saikiran |

సందీప్ రెడ్డి కొత్త‌ సినిమా హీరో మ‌హేష్ బాబుతో చేసే ఛాన్స్ ఉన్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

సందీప్ రెడ్డి కొత్త‌ సినిమా.. హీరో ఎవ‌రంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఏజ్ పైబడినప్పటికీ, కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నారు మహేష్. అయితే అలాంటి ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జక్కన్న దర్శకత్వంలో ఈ సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది.

వార‌ణాసి త‌ర్వాత నెక్ట్స్ ఏంటి ?

వార‌ణాసి సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా పైన అంచనాలు భారీగా పెరిగాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ప్రిన్స్ మహేష్ బాబు తన తర్వాతి సినిమాను చేయబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. వారణాసి సినిమా హైప్ అలాగే కొనసాగాలంటే.. సందీప్ రెడ్డి వంగా లాంటి తోపు దర్శకులతోనే సినిమా చేయాలని మహేష్ డిసైడ్ అయ్యారట. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. కదా సందీప్ తో సినిమా కుదరకపోతే ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టనున్నారట మహేష్. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story