మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

by Sujitha Rachapalli |

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌ నిర్మిస్తుంది.

మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుండగా.. సంయుక్త సినిమా విశేషాలు పంచుకుంది. ‘సంక్రాంతికి రావడం చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి చాలా పెద్ద పండుగ. సంక్రాంతికి వచ్చే ప్రతి సినిమాకి మంచి ఆదరణ ఉంటుంది. ఇది చాలా క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. పండుగకి పర్ఫెక్ట్ మూవీ. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. నాకు కామెడీ సినిమా చేయడం చాలా ఇష్టం. షూటింగ్ కూడా చాలా ఫన్‌గా ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ సహజంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకుంటారు. కానీ ఇది అలా కాదు. డైరెక్టర్ గారు చాలా యూనిక్ పాయింట్‌తో ఈ కథ రాశారు. అది మీరు స్క్రీన్ మీద చూడాలి’ అని కోరింది.

Next Story