Samyukta: నా ఫస్ట్ ప్రయారిటీ అదే.. చేనేత చీరలపై యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకన్న సంయుక్త ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది.

Samyukta: నా ఫస్ట్ ప్రయారిటీ అదే.. చేనేత చీరలపై యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘విరూపాక్ష’ (Virupaksha) సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకన్న సంయుక్త ప్రజెంట్ వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. ఇక ఇప్పటికే.. ‘స్వయంభు’ (Swayambhu), ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Nadu Murari), ‘హైందవ’, ‘అఖండ 2’ వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అయిపోయింది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ షాపింగ్ ఓపెనింగ్‌కు వెళ్లిన సంయుక్త చేనేత చీరలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఎఎస్‌రావు నగర్‌లోని సాకేత్‌ మెయిన్‌ రోడ్, భవానినగర్‌‌లో ఏర్పాటు చేసిన నీలాంబరి సిల్క్స్‌ తొలి షోరూమ్‌ను తాజాగా ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సంయక్త మాట్లాడుతూ.. ‘చేతితో నేసిన పట్టు చీరల కాలానుగుణంగా ఆకర్షణను కలిగి ఉంటాయి. పట్టు చీరలు ప్రతి స్త్రీ వార్డ్‌రోబ్‌లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇక నేను వేడుకల కోసం, వ్యక్తిగతంగా కూడా సాంప్రదాయ చీరలను ధరించడాన్ని ఇష్టపడతాను. అంతేకాదు ప్రత్యేక సందర్భాలలో ఎల్లప్పుడూ నా మొదటి ఎంపిక పట్టు చీరలే’ అంటూ తన అభిరుచులను వెల్లడించారు.

Next Story