- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందరు హృదయాలను హత్తుకుంటుంది.. కార్మేని సెల్వం చిత్రంపై సముద్రఖని కామెంట్స్
సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కార్మేని సెల్వం’ ట్రైలర్ రిలీజ్.

దిశ, సినిమా: విలక్షణ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ మూవీకి రామ్ చక్రి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్ తెలుగు, తమిళ భాషల్లో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలకు సిద్ధం అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఏర్పాటు చేసిన ట్రైలర్ ఈవెంట్‌లో సముద్రఖని మాట్లాడుతూ.. ‘లైఫ్‌ను ఎన్నిరకాలుగానైనా చూపించవచ్చు. ‘కార్మేని సెల్వం’ అనేది లైఫ్‌ను చూపించడంలో డిఫరెంట్ యాంగిల్ అవుతుంది. దర్శకుడు రామ్ చక్రి ఇంటెన్స్ క్రియేటర్. ఇలాంటి మంచి కథలో నన్ను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఇది ఆలోచింపచేసేలా ఉంటుంది. ఈ మూవీలో అందరూ చాలా చక్కగా నటించారు. మా చిత్రం అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుంది’ అని అన్నారు.






