Sampoornesh Babu: అప్‌డేటైన తమ్ముడు అమాయకుడైన అన్న.. ఆసక్తికరంగా ట్రైలర్

by Chukka Sudharani |

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సంపూర్ణేష్‌ బాబు

Sampoornesh Babu: అప్‌డేటైన తమ్ముడు అమాయకుడైన అన్న.. ఆసక్తికరంగా ట్రైలర్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సంపూర్ణేష్‌ బాబు (Sampoornesh Babu). ఇప్పుడు మరోసారి తన ఫర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను నవ్వించేందుకు వచ్చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోదరా’ (Sodara). అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌ (Sanjosh) కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మోహన్ మేనంపల్లి (Mohan Menampally) దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్‌ 25న ఎంటర్‌టైన్‌చేయడానికి థియేటర్స్‌ల్లో విడుదల కాబోతుంది.

ఈ క్రమంలోనే ట్రైలర్‌ (Trailer) లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో సంపూ మాట్లాడుతూ.. సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.. ‘ఈ వేడుక చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన సాయి రాజేష్ ఈ వేడుకకు రావడం హ్యపీగా ఉంది. అప్‌డేట్‌ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వఛ్చమైన కథ సోదరా. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది నేను రియల్‌లైఫ్‌లో ఎలా ఉంటానో అలాంటి పాత్ర ఇది. అందరూ ఈ సినిమాను ఆదరించి మా అందరికి మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.

Next Story