Sampoornesh Babu: నాకు అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది.. సంపూర్ణేష్ బాబు వైరల్ కామెంట్స్

by Chukka Sudharani |

సంపూర్ణేష్‌ బాబు (Sampoornesh Babu), సంజోష్ (Sanjosh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోదరా’

Sampoornesh Babu: నాకు అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది.. సంపూర్ణేష్ బాబు వైరల్ కామెంట్స్
X

దిశ, సినిమా: సంపూర్ణేష్‌ బాబు (Sampoornesh Babu), సంజోష్ (Sanjosh) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోదరా’ (Sodara). అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌లు మీడియాతో ముచ్చటించారు. సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ.. ‘అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెర(silver screen)పై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదు.ఇది కుటుంబ కథ ఇద్దరూ అన్నదమ్ముల కథ. అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరికి తమ రియల్‌లైఫ్‌ సంఘటనలు గుర్తుకు వస్తాయి. అలాగే ఈ సినిమాలో ఉండే వినోదం కూడా ఎంతో ఆహ్లాదంగా ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉంటుంది. అందరూ హృదయ కాలేయం లాంటి సినిమాలు మళ్లీ మీ నుంచి ఎందుకు రావడం లేదు? అంటున్నారు. ఈ మధ్య కథలు విన్నాను. కానీ పెద్దగా నాకు ఎక్కలేదు. హృదయాకాలేయం మించిన కామెడీ కథ దొరికితే చేస్తాను. ప్రస్తుతం ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాను. ఏ అనే సినిమాలో ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉంది’ అన్నారు.

సంజోష్‌ మాట్లాడుతూ.. ‘సంపూతో కలిసి ఓ బ్రదర్‌గా ఈ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయినా తమ్ముడి కథ. ఇలాంటి అన్నదమ్ముల కథతో ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా రాలేదు. ఈ సినిమా చూసిన తరువాత అందరూ కనెక్ట్‌ అవుతారు. సినిమా పూర్తవగానే అన్నకు తమ్ముడు, తమ్ముడు అన్నకు తప్పనిసరిగా ఫోన్‌ చేసి మాట్లాడుతాడు. అంతలా అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది’ అని తెలిపారు.

Next Story