బాలయ్య బర్త్‌డే స్పెషల్... రీ రిలీజ్ కానున్న ఆ ఇండస్ట్రీ హిట్ ఫిలిం

by Pulgam srinivas |

బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన సమరసింహారెడ్డి చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

బాలయ్య బర్త్‌డే స్పెషల్... రీ రిలీజ్ కానున్న ఆ ఇండస్ట్రీ హిట్ ఫిలిం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన పుట్టినరోజు వచ్చిందంటే చాలు ఆయన అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం నెలకొంటుంది. ఇక ఈ సంవత్సరం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ఒక ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. బాలకృష్ణ చాలా సంవత్సరాల క్రితం సమరసింహారెడ్డి అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఇందులో సిమ్రాన్, సంఘవి, అంజలి జవేరి హీరోయిన్లుగా నటించగా బి. గోపాల్ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సత్యనారాయణమ్మ బ్యానర్‌పై నిర్మించారు. ఆ సమయంలో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ టైంలో రీ రిలీజ్ అయిన చాలా సినిమాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. మరి సమరసింహారెడ్డి లాంటి మాస్ ఎంటర్టైనర్ కి ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.

Next Story