- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: అలాంటి చెయ్యకండి నేను ప్రోత్సహించను.. ఫ్యాన్‌పై సమంత షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ‘శుభం’ (Shubham) చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ‘శుభం’ (Shubham) చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే 9న గ్రాంగ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. దీంతో రిలీజ్ సమయం దగ్గర పడటంతో వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ (Glimpses), ట్రైలర్ (Trailer), సాంగ్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ‘శుభం’ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేప్రయత్నంగా.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు చిత్ర బృందం. ఇందులో భాగంగా నిర్మాత సమంత పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
‘‘శుభం’ సినిమా ఎంతో ఎంటర్‌టైనింగ్ (Entertaining) ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా మెప్పింస్తుందనే నమ్మకం ఉంది. శుభం సినిమా 8 నెలల్లో షూటింగ్ పూర్తి చేశాం. తక్కువ సమయంలో తీసిన అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో క్యామియో రోల్ కోసం వేరే వాళ్ళని అడగలేక.. నేనే చేసేశాను’ అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. ‘కొత్త కథలు చెప్పాలి, అందరికీ అవకాశం ఇవ్వాలి అనే ట్రాలాలా బ్యానర్ స్టార్ట్ చేశాను. భవిష్యత్తులో నేను ప్రొడ్యూస్ చేసే అన్నీ సినిమాలకు ఆర్టిస్టులకు ఈక్వల్ పే ఇచ్చేలా ప్లాన్ చేస్తాను. అయితే.. అది కచ్చితంగా సినిమా బడ్జెట్ బట్టి అండ్ స్క్రిప్ట్ బట్టి ఉంటుంది’ అని తెలిపారు. అయితే.. సమంతపై అభిమానంతో సందీప్ అనే వ్యక్తి గుడి కట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సమంత ‘సందీప్ అనే అబ్బాయి నా కోసం గుడి కట్టాడు అని తెలిసింది. వారి ప్రేమను నేను కచ్చితంగా స్వీకరిస్తాను. కానీ.. ఇలా గుళ్ళు కట్టడం అనేది మాత్రం నేను ప్రోత్సహించను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






