సమ్మర్ ట్రీట్.. ఘాటు అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమంత

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో దాదాపు 14 సంవత్సరాలుగా..

సమ్మర్ ట్రీట్..  ఘాటు అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమంత
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో దాదాపు 14 సంవత్సరాలుగా.. ఇండస్ట్రీని దున్నేస్తున్నారు సమంత. తన జీవితంలో ప్రేమ, పెళ్లి అలాగే విడాకులు... ఇలా వరుసగా జరిగినప్పటికీ.. తన కెరీర్ మాత్రం ఎక్కడా డౌన్ కాలేదు. టాలీవుడ్ ( Tollywood)ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ సమంత రాణిస్తోంది.

అయితే మొన్నటి వరకు హీరోయిన్ గా నటించిన... ఈ బ్యూటీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అవతారం ఎత్తింది.. సమంత ప్రొడక్షన్ లో శుభం ( Shubham) అనే కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 9వ తేదీ 2025 సంవత్సరంలో రిలీజ్ కానుంది. ఈ సినిమా పూర్తిగా హారర్ అలాగే కామెడీ ఉంటుందట. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్ నేపథ్యంలో హీరోయిన్ సమంత... తలుక్కున మెరిశారు.

రెడ్ అండ్ వైట్ విత్ ఫ్లవర్స్ కాంబినేషన్ లో ఉన్న.. సారీ కట్టి... తన అందాలను ఆరబోశారు సమంత. అలాగే స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించి... కాస్త బోల్డ్ అందాలను కూడా అందించారు. ఈ ఈవెంట్ నేపథ్యంలో... అందరి కండ్లు అన్ని తన పైనే పడిపోయేలా మెరిశారు. ఇక సమంత ఫోటోలు క్షణాల్లోనే వైరల్ కావడంతో హాట్ హాట్ కామెంట్స్ తో నెటిజెన్స్ రెచ్చిపోతున్నారు. ఎండాకాలంలో.. ఘాటు అందాలతో సమంత రెచ్చిపోయిందని అంటున్నారు. ఇక ఈవెంట్ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మీరు లేకపోతే తన కెరీర్ లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


Next Story