ఎట్టకేలకు రాజ్- సామ్ డేటింగ్ రూమర్స్ పై స్పందించిన సమంత మేనేజర్.. షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాత‌గా మారి నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’(Subham) మంచి విజయం సాధించింది.

ఎట్టకేలకు రాజ్- సామ్ డేటింగ్ రూమర్స్ పై స్పందించిన సమంత మేనేజర్.. షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) నిర్మాత‌గా మారి నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’(Subham) మంచి విజయం సాధించింది. ఈ సినిమా ద్వారా కొంతమంది కొత్త నటీనటులను.. సైతం ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కెరీర్‌లో స‌మంత ఎప్పుడు టాప్‌లోనే ఉంది. అయితే ప‌ర్స‌న‌ల్ లైఫ్ మాత్రం కాస్త డిస్ట్ర‌బ్ అయింది. అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల తర్వాత సింగిల్‌గా ఉంటుంది స‌మంత‌. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

గత కొంతకాలంగా సమంత వైవాహిక జీవితం గురించి నెట్టింట అనేక వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు కారణం సామ్ ఇటీవల డైరెక్టర్ రాజ్‌ నిడిమోరుతో క్లోజ్‌గా ఉన్న ఫొటో షేర్ చేయడమే. దీంతో త్వ‌ర‌లో వీరిద్ద‌రు డేటింగ్‌లో ఉన్నారని, కలిసి ఉండటానికి ఓ ఇల్లు కోసం చూస్తున్నారని కొన్ని పుకార్లు నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై తాజాగా సమంత మేనేజర్ స్పందించారు. ‘ ఈ వార్తలన్నీ రూమర్స్ మాత్రమే. వీటిని నమ్మొద్దు. అవాన్నీ పూర్తిగా అవాస్తవాలు’ అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story