‘మా ఇంటి బంగారం’ రాకకు ముహూర్తం ఫిక్స్

by Chukka Sudharani |   (  Updated:2026-02-23 04:40:44  IST  )

సమంత ‘మా ఇంటి బంగారం’ సమ్మర్ స్పెషల్‌గా మే 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది.

‘మా ఇంటి బంగారం’ రాకకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సమంత.. ప్రజెంట్ నిర్మాతగా, హీరోయిన్‌గా రాణిస్తూ సందడి చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్‌ నెం-2గా ‘మా ఇంటి బంగారం’చిత్రాన్ని తీసుకొస్తుంది. ఇటీవల దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సమంత స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘మా ఇంటి బంగారం మీ అభిమాన థియేటర్లలో.. మే 15, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది’ అంటూ తెలిపారు. కాగా.. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా.. మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తు్న్నారు. ఇక ఇప్పటికే ఇందులోనుంచి వచ్చిన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంతే కాకుండా.. చాలా గ్యాప్ తర్వాత సమంత ఫుల్ రోల్ చేస్తుండగా.. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ట్రోలర్స్‌కు స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన సమంత.. నా ఇంటి వరకు వచ్చారంటే బాగోదంటూ వార్నింగ్

Next Story