- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ మార్నింగ్.. ప్రశాంతమైన జీవితం కోసం ఈ ఎనిమిది రూల్స్ తప్పవు అంటుంది సమంత
స్టార్ బ్యూటీ సమంత తాజాగా తన మార్నింగ్ రొటీన్‌ను అభిమానులతో పంచుకుంది.

దిశ, సినిమా: స్టార్ బ్యూటీ సమంత తాజాగా తన మార్నింగ్ రొటీన్‌ను అభిమానులతో పంచుకుంది. ‘పవర్ మార్నింగ్’ అనేది తన జీవితాన్ని ఎంతగానో మార్చిందని చెప్పుకొస్తూ.. ‘ఉదయం ప్రశాంతంగా మొదలైతే మిగిలిన రోజంతా ఉత్సాహంగా ఉంటుందని నమ్ముతా. ఇప్పటివరకూ ఎన్నో మార్నింగ్ రొటీన్స్‌ను ఫాలో అయ్యా. చివరకు ఒక సులభతరమైన ఫార్ములాకు అలవాటు పడ్డా. అది ఉపయోగపడింది. అదే నా పవర్ మార్నింగ్. నిద్రలేచే సమయానికి ఒత్తిడికి గురి చేసే హార్మోన్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది ఎవరికైనా సాధారణం. కాబట్టి, నిద్ర లేచిన వెంటనే మనం ఏం చేస్తున్నామనేది ముఖ్యం. చాలామంది ఫోన్లు పట్టుకుంటారు. మెయిల్స్ చూడటం, వర్క్ గురించి ఆలోచిస్తారు. దీనివల్ల ఉదయాన్నే మరింత ఒత్తిడికి గురవుతారు.. కానీ ప్రశాంతమైన జీవనం కోసం ఈ ఎనిమిది రూల్స్ ఫాలో అవ్వాలి. నిద్ర లేచిన తర్వాత ఒక గంట పాటు ఫోన్ వాడకపోవడం, ఐదు నిమిషాలు ధ్యానం, సూర్యరశ్శి తగిలేలా కూర్చోవడం, గోరువెచ్చటి నీళ్లలో పసుపు, నిమ్మరసం కలిపి తాగడం, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్, 11 గంటలలోపే వర్కౌట్లు చేయాలి. ఆ రోజు ఏం సాధించాలనుకుంటున్నామనేది నిర్ణయించుకుని ఒక పుస్తకంలో రాసుకోవాలన్నారు. జీవితంలో మార్పు కావాలనుకునేవారు 21 రోజులపాటు దీనిని ఫాలో అవ్వండి’ అంటూ తెలిపింది.






