- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో సమంత కీ రోల్.. స్పందించి క్లారిటీ ఇవ్వడంతో అంతా షాక్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఇటీవల ‘పుష్ప-2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం పలు రికార్డులు బద్దలు కొట్టడంతో వరల్డ్ వైడ్‌గా ఆయన రేంజ్ మారిపోయింది. దీంతో అదే ఫామ్‌తో అల్లు అర్జున్ వరుస మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘AA-22’. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) తెరకెక్కిస్తున్నారు. అయితే దీనిని అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ముంబైలో జరగ్గా.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి AA-22కు సంబంధించిన ఏదో వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమాలో సమంత అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటిస్తోందని పలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సమంత(Samantha) ఈ విషయంపై స్పందించింది. ఆమె నిర్మించిన ‘శుభం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా క్లారిటీ ఇచ్చింది. ‘‘నేను అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్‌లో నటించడం లేదు. నాకు అట్లీతో మంచి బంధం ఉంది అయితే భవిష్యత్తులో మేము ఇద్దరం కలిసి పని చేస్తాము’’ అని చెప్పుకొచ్చింది. దీంతో పుకార్లకు చెక్ పడింది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా అట్లీతో ఉన్న స్నేహబంధం కారణంగా ఇందులో నటిస్తుందని అంతా భావించారు. కానీ ఆమె నటించడం లేదని తెలపడంతో షాక్ అవుతున్నారు.






