‘ఏ కష్టం వచ్చినా నేను ముందు వెళ్లేది ఆయన వద్దకే’.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-17 12:06:59  IST  )

టాలీవుడ్(Tollywood) అగ్ర కథానాయకురాలు సమంత(Samantha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఏ కష్టం వచ్చినా నేను ముందు వెళ్లేది ఆయన వద్దకే’.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) అగ్ర కథానాయకురాలు సమంత(Samantha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న సామ్ మాట్లాడుతూ.. ‘సురేష్ బాబు(Suresh Babu) ఎప్పటికీ నా ఫ్యామిలీ.. నాకు ఏ అవసరం వచ్చినా ఆయన వద్దకే ముందు వెళ్తాను. ఆయన వెంటనే హెల్ప్ చేస్తారు’ అని సామ్ చెప్పుకొచ్చింది. అనంతరం మూవీ గురించి మాట్లాడుతూ.. అసలు ఈ సినిమాకు నేనేం పెద్దగా కష్టపడలేదు. కేవలం ప్రమోషన్స్‌లో పాల్గొన్నాను. మిగతా సినిమా పనులన్నీ టీమ్‌ చూసుకుంది. ప్రేక్షకుల ఆదరణ, ప్రశంసలు వారికే దక్కాలి. మేమెంత కష్టపడినా.. ప్రేక్షకులకు సినిమా నచ్చితేనే విజయం అందుకుంటుంది.

‘శుభం’ విషయంలో తెలుగు ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిర్మాతగా తొలి అడుగులు వేస్తున్న నాకు మైత్రీ మూవీ మేకర్స్‌(Mythri Movie Makers) సంస్థ సపోర్ట్‌ చేసింది’ అని సమంత అన్నారు. కాగా, సమంత(Samantha) ‘శుభం’ చిత్రంలో అతిథి పాత్ర పోషించారు. గవిరెడ్డి శ్రీనివాస్‌, శాలిని, శ్రియ కొంతం, చరణ్‌ పేరి తదితర వర్ధమాన నటులతో దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కించారు. ఈ హారర్‌ కామెడీ మూవీ ఈ నెల 9న విడుదలైన సంగతి తెలిసిందే. శుక్రవారం నిర్వహించిన సక్సెస్‌ ఈవెంట్‌‌లో సమంత సహా టీమ్ పాల్గొని, సందడి చేసింది.

Click For Tweet..

Next Story