నా సంతోషానికి కారణమైన ఆయన్ని వదిలి ఉండలేను.. వైరల్‌గా సమంత ఎమోషనల్ కామెంట్స్

by Chukka Sudharani |

తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలలో తన భర్త రాజ్ ఎంత కీలకపాత్ర పోషించాడో వివరిస్తూ సమంత ఎమోషనల్ కామంట్స్ చేసింది.

నా సంతోషానికి కారణమైన ఆయన్ని వదిలి ఉండలేను.. వైరల్‌గా సమంత ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: త్వరలో ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది హీరోయిన్ సమంత. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 15న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతున్నది. ‘ఓ బేబీ’తో సూపర్ హిట్ అందుకున్న తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అంతే కాకుండా.. ప్రమోషనల్ కంటెంట్‌తో మరింత అంచాలు పెంచేస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తన భర్త రాజ్ నిడిమోరుపై ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘నా జీవితంలో ఇన్ని సంఘటనలు చోటుచేసుకున్న తర్వాత కూడా.. నేను ఒక మంచి వ్యక్తిగానూ, ఒక ఉత్తమ నటిగానూ ఎదగడానికి కారణం నా భర్త రాజే. మేము ప్రతి పనినీ కలిసే చేస్తాము. పని, వినోదం, చివరికి వ్యాయామం కూడా. ఒక్క రోజు కూడా నేను అతనికి దూరంగా ఉండలేను’ అంటూ చెప్పుకొచ్చింది. తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలలో తన భర్త రాజ్ ఎంత కీలకపాత్ర పోషించాడో వివరిస్తూ సమంత చేసిన కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story