- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: అక్కినేని ఫ్యామిలీతో సమంత.. మాజీ కోడలు అవార్డు అందుకోవడంపై అమల రియాక్షన్ ఇదే! (వీడియో)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరి కాపురం సజావుగా సాగలేదు. కొద్ది కాలానికే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో చైతు సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. కానీ సమంత మాత్రం ఇండస్ట్రీకి దూరం అయింది. విడాకుల తర్వాత మయోసైటీస్ వ్యాధి తీవ్రతరం కావడంతో పూర్తిగా రెస్ట్ తీసుకుంది. ఇతర దేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్న ఆమె ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ప్రారంభించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెబుతోంది. అలాగే ఓ నిర్మాతగా మారి ‘శుభం’(shubham) చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక నాగచైతన్య మాత్రం శోభిత(Sobhita)తో సీక్రెట్‌గా డేటింగ్ చేసి ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం NC-24 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, చైతు మాజీ భార్య సమంత, అక్కినేని ఫ్యామిలీని కలిసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అమలతో కలిసి వేదికను పంచుకోవడంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే జీ తెలుగు నిర్వహించిన ఓ అవార్డు వేడుకల్లో అమల, సమంత పాల్గొన్నారు.ఇక ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంతకు అవార్డు అందించగా.. ఆమె ఎమోషనల్‌గా మాట్లాడుతున్న సమయంలో అమల చప్పట్లు కొడుతూ కనిపించింది. అలాగే అమల 30 ఏళ్లకు పైగా జంతు సంరక్షణ చేపట్టినందుకు అవార్డు దక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ప్రొమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.






