- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Samantha: సమంత మళ్లీ ప్రేమలో పడిందా.. అలాంటి పోస్ట్‌తో హింట్ ఇచ్చేసిందిగా.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు!

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maaya Chesave) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడుకి ఊహించని పాపులారిటీ దక్కింది. ఆ తర్వాత టాలీవుడ్, తమిళ స్టార్ హీరోల సరసన ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అమ్మడు అందానికి ఫిదా అవ్వని వారు లేనరనడంతో అతిశయోక్తి లేదు. 20 ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో నటించిన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే అక్కినేని నాగచైతన్య(Akkineni Nagachaitanya)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొన్నేళ్ల పాటు వీరి కాపురం సాఫీగా సాగినప్పటికీ మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకుని విడిపోయారు.
ఆ తర్వాత సామ్ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ మయోసైటీస్ కారణంగా గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా ‘ఖుషి’ మూవీలో కనిపించింది. ఇక అప్పటినుంచి ఇంట్లోనే ఉంటే మయోసైటీస్‌కు చికిత్స తీసుకుంటోంది. అలాగే పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఇక ఓ పాడ్ కాస్ట్ కూడా మొదలెట్టిన ఆమె అనేక విషయాలను వెల్లడిస్తోంది. కానీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ మాత్రం ఇవ్వడం లేదు. ఆమె అభిమానులు మాత్రం మళ్లీ సినిమాలు చేయాలని ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సమంత ఓ డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
కానీ దీనిపై ఆమె మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో.. తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో ఓ షర్ట్‌పై రెడ్ హార్ట్ సింబల్ కూడా ఉంది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె మళ్లీ ప్రేమలో పడింది ఈ పోస్ట్‌తో హింట్ ఇచ్చిందని అంటున్నారు. అలాగే చాలా సంతోషంగా ఉందని కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆమె అభిమానులు మాత్రం అవన్నీ అబద్ధాలు అని కొట్టిపారేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఆమె ఫొటోగ్రఫీ బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సమంత పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.