ఆ స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పు చేసిన Samantha .. ఎందుకంటే?

by Hamsa |
ఆ స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పు చేసిన Samantha  .. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతుంది. అయితే ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్లనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సమంత సోషల్ మీడీయాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.

అయితే సామ్ తన ఫైనాన్స్ స్టేటస్ బాగోలేని కారణంగా ట్రీట్మెంట్ కోసం స్టార్ హీరో దగ్గర 25 కోట్లు అప్పుగా తీసుకుందన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఆమె ట్రీట్మెంట్ కోసం చాలా ఖర్చు అవుతుండటంతో డబ్బులు లేక తన బెస్ట్‌ఫ్రెండ్ దగ్గర అప్పుచేసినట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమంత అప్పు చేయడంతో సంచలనంగా మారింది. ఈ విషయం ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ ఇది తెలిసిన నెటిజన్లు అక్కినేని ఫ్యామిలీలో ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా అని ఘాటుగా స్పందిస్తున్నారు.

Also Read: పాపను కన్నది అందుకే Ranbir Kapoorపై Kangana సంచలన వ్యాఖ్యలు

Next Story