- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాటికి దూరంగా ఉంటానంటూ షాకింగ్ డెసిషన్ తీసుకున్న సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.
కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది.
అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. అందులో ఓ మూడు రోజులు ఫోన్ లేకుండా.. ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండాలనుకున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ వాడకుండా, ట్విట్టర్లో ట్వీట్లు వేయకుండా, ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఉండలేం.
అలా బతకడం చాలా కష్టమని, మనతో మనం ఒంటరిగా ఉండటం చాలా కష్టమని, అయినా కూడా ఎంతో గొప్పగా అనిపించిందని సమంత ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఓ మూడు రోజులు సైలెన్స్ మెయింటైన్ చేయాలని.. ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని సమంత సలహా ఇచ్చింది. వీలైతే అందరూ అలా ఉండాలని చెప్పుకొచ్చింది ఈ చిన్నది. కాగా సామ్ సలహాను ఇప్పటి వరకు 80 శాతం నెటిజన్స్ అంగీకరించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






