ఇంటి పేరు మార్చుకోవ‌డంపై స‌మంత షాకింగ్ నిర్ణ‌యం ?

by velandi.Saikiran |

అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇంటి పేరును అక్కినేని సమంతగా మార్చుకుంది.

ఇంటి పేరు మార్చుకోవ‌డంపై స‌మంత షాకింగ్ నిర్ణ‌యం ?
X

దిశ‌, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఇటీవల కాలంలోనే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత, సమంత మరో పెళ్లి చేసుకుంది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోర్ ను వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది సమంత. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ లేకుండానే, సినిమాపై ఫోకస్ కూడా పెట్టేసింది. షూటింగ్ కు కూడా రెగ్యుల‌ర్ గా వెళుతోంది సామ్. అయితే అలాంటి సమంత తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇంటి పేరును అక్కినేని సమంతగా మార్చుకుంది. ఎప్పుడైతే చైతూతో విడాకులు అయ్యాయో, ఆ క్షణం నుంచి తన పేరును సమంత రూత్ ప్రభుగా మార్చేసుకుంది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది సమంత. అయితే రాజ్ నిడమోరును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇంటిపేరు మారుతుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అందరికీ షాక్ ఇచ్చేలా సమంత సంచలన నిర్ణయం తీసుకున్నారట. తన ఇంటిపేరు మార్చేది లేదని, సమంత అనే బ్రాండ్ తోనే ముందుకు వెళ్తానని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. దీనికి తన భర్త రాజ్ నిడిమోర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Next Story