సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరంటే ?

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Ruthu) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో పెళ్లి (Second Marriage

సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. వరుడు ఎవరంటే ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Ruthu) షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో పెళ్లి (Second Marriage) చేసుకునేందుకు ఆమె డిసైడ్ అయ్యారట. ఈ మేరకు తన సన్నిహితులతో.. రెండో పెళ్లిపై సమంత ( Samantha ) చర్చించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన మొదటి భర్త అక్కినేని నాగచైతన్య ( Akkineni Nagachaitanya) రెండవ వివాహం చేసుకున్న తర్వాత.. సమంత కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు రంగం చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిదిమోరు ( Raj Nidimoru) తో సమంతా గత కొన్ని రోజులుగా డేటింగ్ లో ( Dating) ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అతనితో చెన్నైలో కూడా తిరిగింది సమంత. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ.. రాజ్ నిదిమోరును పెళ్లి చేసుకునేందుకు సమంత నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ మేరకు.. తన కుటుంబ సభ్యులతో కూడా చర్చించారట హీరోయిన్ సమంత. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ... మే నెలలో ఈ వివాహం జరిగే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా సమంత మొదటి భర్త అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల గత ఏడాది చివరిలో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story