- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: ఊహించని లుక్‌లో దర్శనమిచ్చి షాకిచ్చిన సమంత.. పగలబడి నవ్విన నాగార్జున (పోస్ట్)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె ‘ఖుషి’ తర్వాత నుంచి సినిమాలకు దూరం అయింది. మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో పూర్తిగా రెస్ట్ తీసుకుంది. ఈ క్రమంలోనే అన్ని పలు దేశాల్లో తిరిగి రకరకాల ట్రీట్‌మెంట్ తీసుకుని మయోసైటీస్ నుంచి బయటపడింది. ఇక ఇటీవల ‘సిటాడెల్:హనీ బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్ సిరీస్‌తో అందరినీ మెస్మరైజ్ చేసింది.
ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చి నంబర్ ప్లేస్‌ను దక్కించుకుంది. దీంతో మళ్లీ సినిమాల్లో వస్తుందని అంతా భావించారు. కానీ సమంత హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే పలు విషయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ అందరినీ ఆలోచింపచేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
ఇందులో ఆమె షార్ట్ హెయిర్‌తో అబ్బాయిలా కనిపించింది. అలాగే జుట్టు మొత్తాన్ని ఒకే సైడ్‌కు పెట్టి ఫొటోకు పోజులిచ్చింది. ఇక బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఆమె లో దుస్తులు లేకుండా దర్శనమిచ్చింది. ఇక ఈ పిక్స్ చూసిన ఓ నెటిజన్ అక్కినేని నాగార్జున(Nagarjuna), సామ్ మాజీ మామ పగలబడి నవ్వుతున్న మీమ్ షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. మరికొందరు మాత్రం ఆమె చాలా బాగుందని కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు ఇంకో అమీ జాక్సన్‌లా అవుతావా? అని ప్రశ్నిస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం అది విగ్ ఫొటో కోసమే అలా చేసిందని అంటున్నారు. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also..
Jyothi Rai: వామ్మో ఇంత యవ్వారం ఉందా ఈమెలో.. మరోసారి రెచ్చిపోయిన బుల్లితెర నటి






