నేచర్, యానిమల్, గుడ్ వైబ్స్ అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2025-03-28 06:05:15  IST  )

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

నేచర్, యానిమల్, గుడ్ వైబ్స్ అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.

విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పక్షులు, జంతువులతో ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా కొన్ని క్యూట్ ఫొటోస్‌కి కూడా స్టిల్స్ ఇచ్చింది.

ఇక వాటికి.. ‘ప్రకృతి, జంతువులు అండ్ మంచి వైబ్‌లు.. కంగారూలకు ఆహారం ఇవ్వడం నుండి నిద్రపోతున్న కోలాలను చూడటం వరకు, ఇది చాలా అందమైన సమయం.. ఆస్ట్రేలియన్ వన్యప్రాణుల కోసం వారు చేసే అద్భుతమైన పునరావాస పనులన్నింటికీ @featherdalewildlifepark బృందానికి ప్రధాన అభినందనలు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. యానిమల్స్ కంటే నువ్వే చాలా క్యూట్ ఉన్నావ్ సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రదేశాన్ని కచ్చితంగా విజిట్ చేస్తామని అంటున్నారు.

Read More..

అచ్చ తెలుగు అమ్మాయిల రెడీ అయిన నాగార్జున బ్యూటీ.. సో సూపర్ అంటూ కామెంట్స్


Next Story