అచ్చ తెలుగు అమ్మాయిల రెడీ అయిన నాగార్జున బ్యూటీ.. సో సూపర్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |

కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అచ్చ తెలుగు అమ్మాయిల రెడీ అయిన నాగార్జున బ్యూటీ.. సో సూపర్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్(Ashika Ranganath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన ‘అమిగోస్’(Amigos) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కింగ్ నాగార్జున(Nagarjuna) సరసన ‘నా సామి రంగా’(Na Saami Ranga) చిత్రంలో నటించింది.

ఈ మూవీలో ఈ భామ, యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో సిద్ధార్థ్(Sidharth) సరసన ‘మిస్ యూ’(Miss You) మూవీలో నటించింది. అయితే ఈ చిత్రం కోలీవుడ్‌లో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగులో మాత్రం డిజాస్టర్‌గానే మిగిలింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న ‘విశ్వంభర’(Vishwambhara) సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో తన గ్లామర్ డోస్‌తో అమాంతం కుర్రకారును రెచ్చగొడుతున్న అషికా తాజాగా తన ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

అందులో చీరకట్టుకుని, జడ వేసుకుని, మల్లె పూలు పెట్టుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఎప్పుడూ బోల్డ్‌ లుక్‌లో దర్శనమిచ్చే ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు అచ్చ తెలుగు అమ్మాయిలా రెడీ అయ్యే సరికి ఈ ఫొటోస్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి. కాగా ఏదో ఫంక్షన్‌కు ఈ ముద్దుగుమ్మ ఇలా రెడీ అయినట్లు తెలుస్తోంది.

Next Story