- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హ్యాపీ వీకెండ్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన సమంత.. మీరే మాకు ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్స్
స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది.. ఇక హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తర్వాత సమంత మయసైటీస్ అనే వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
ఇక గత ఏడాది ''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అలాగే నిర్మాతగా మారి శుభం అనే సినిమాను నిర్మించి మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. సమంత నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈక్రమంలో తాజాగా సామ్ తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్, వీడియోస్ షేర్ చేసింది. ఇక వాటికి ఇంట్రెస్టింగ్ కోట్స్‌తో పాటు హ్యాపీ వీకెండ్ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటని చూసిన సామ్ ఫ్యాన్స్ నువ్వే మాకు ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






