- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతని ఫొటోలు షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించిన సమంత.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్(పోస్ట్)
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మయోసైటీస్(Myositis) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. అలాగే నిర్మాతగా మారి పలు చిత్రాలు కూడా నిర్మిస్తోంది. అలా రీసెంట్‌గా ‘శుభం’(Subham) మూవీను నిర్మించి ప్రొడ్యూసర్‌గా మంచి విజయం సాధించింది. అలాగే ప్రజెంట్ ‘రక్త బ్రహ్మాండ్’(Rakth Brahmand) అనే మూవీలో నటిస్తోంది. ఇక ఈ చిన్నది సోషల్ మీడియా(Social Media)లో ఎంత యాక్టీవ్‌గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సినిమాలకు గ్యాప్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ ఉంటూ అభిమానులకు, ఫాలోవర్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. తన లైఫ్‌లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని కూడా పంచుకుంటూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ తన ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో హీరో కమ్ విలన్ మనోజ్ బాజ్ పాయ్(Manoj Bajpai) అండ్ ఆమె దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూ హ్యాపీ, షాక్, థ్రిల్, యాంగర్, జోష్, ఫన్నీ అంటూ పలు షేడ్స్ ఉన్న పిక్స్‌ను పంచుకుంది. అంతేకాకుండా.. ‘మీతో ఉండే ప్రతి భావోద్వేగాన్ని అనుభూతి చెందడానికి స్వైప్ చేయండి.. #ItsOnAmazonPrime # త్వరలో వస్తుంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.ఇక దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సీజన్-3 రాబోతుందని ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్-3’(The Family man-3) రీసెంట్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ భామ ఈ ఫొటోస్ షేర్ చేయడం నెట్టింట వైరల్‌గా మారాయి.






