జర్నీ స్టార్ అయిందని అతని భుజం మీద పడుకున్న ఫొటో షేర్ చేసిన సమంత.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

by Gugulothu.Kavitha |

సమంత(Samantha) మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడి గత ఏడాది ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) సినిమాతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

జర్నీ స్టార్ అయిందని అతని భుజం మీద పడుకున్న ఫొటో షేర్ చేసిన సమంత.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత(Samantha) మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడి గత ఏడాది ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) సినిమాతో మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిర్మాతగా మారి ‘శుభం’(Subham) అనే సినిమాను నిర్మించింది. ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 9న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలో సమంత వరుస ఇంటర్వ్యూలు, ఫొటోస్ షేర్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా సామ్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో శుభం మూవీటీమ్‌తో పాటు తన రూమర్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. రాజ్ భుజం పై తల వాల్చి తీసుకున్న క్యూట్ ఫొటోను షేర్ చేసింది. అలాగే కొన్ని స్పెషల్ మూమెంట్స్‌ను కూడా పంచుకుంది. ఇక వాటికి.. ‘శుభం సినిమాని మాతో కలిసి చూసి, అనుభూతి చెంది, జరుపుకున్నందుకు ధన్యవాదాలు.. మా తొలి అడుగు హృదయం, పిచ్చి అండ్ కొత్త, తాజా కథలతో నిండిపోయింది.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ మరియు శుభంతో మా ప్రయాణం ప్రారంభమైంది. ఎంత గొప్ప ప్రారంభం ఇది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story