- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంతకు నరకం.. ఒకేసారి 500 మంది !
టాలీవుడ్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత ( Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో 14 సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ బ్యూటీ. ఈ 14 సంవత్సరాల కాలంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఇక్కడ కూడా తగ్గలేదు హీరోయిన్ సమంత.
ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు హీరోయిన్ సమంత. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరోయిన్ సమంత. ఈ సందర్భంగా అల్లు అర్జున్ (Allu arjun) నటించిన పుష్ప సినిమాలోని ( Pushpa) ఊ అంటావా ( Oo Antava Oo Oo Antava) అనే ఐటెం సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సమంత. వాస్తవానికి తనకు ఐటమ్ సాంగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండబోదని.. ఆమె పేర్కొన్నారు. నేనెప్పుడూ స్పెషల్ సాంగ్స్ చేయలేదు... అలాంటివి తనకు అస్సలు సెట్ కావని పేర్కొన్నారు.
అయినా కూడా ఓ చాలెంజ్ గా తీసుకొని ఐటమ్ సాంగ్ చేసినట్లు వివరించారు సమంత. మొదట తనకు ఈ సాంగ్ ఆఫర్ వచ్చినప్పుడు చాలా షాక్ అయినట్లు తెలిపారు. ఈ సాంగ్ నేపథ్యంలో... ఫస్ట్ షార్ట్ ను 500 మంది జూనియర్ ఆర్టిస్టుల ముందు చేసినప్పుడు చాలా భయంతో వణికి పోయినట్లు... బాంబు పేల్చారు సమంత. అది పెద్ద నరకంగా కనిపించిందని తెలిపారు. నేను అందంగా అలాగే హాట్ గా కనిపిస్తానని భావన తనలో ఎప్పుడూ కూడా లేదని స్పష్టం చేశారు.






