- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: ఇండస్ట్రీలో బెస్ట్ హీరోయిన్స్ ఎవరో చెప్పిన సమంత.. వీడియో వైరల్
బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీకి లేడీ ఫాలోయింగ్ కూడా ఎక్కువే అని చెప్పుకోవచ్చు. సామ్ సినిమాలు ఫ్లాప్ అయినా.. బ్లాక్ బస్టర్ హఇట్ అయినా మాకు ఆల్ టైం ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. తన టాలెంట్ ను అతితక్కువ సమయంలోనే బయటపెట్టి.. స్టార్ డమ్ సంపాదించుకుంది.
కెరీర్ మొదట్లోనే ఈ భామ అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంది. ఏమాయ చేశావే (emaya cheśave)సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సామ్ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Walkitlo Sirimalle Chettu), సమ్‌థింగ్ సమ్‌థింగ్ (Something Something), ఎటో వెళ్లిపోయింది మనసు, అత్తారింటికి దారేది, ఆటోనగర్ సూర్య (Autonagar Surya), యశోద (Yashoda), ఓ బేబీ (oh baby), జాను, ఖుషీ (Khushi) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.
ఇకపోతే తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తను మాట్లాడిన వీడియోలు పంచుకుంది. ఈ క్రమంలో ఇండస్ట్రీలో బెస్ట్ హీరోయిన్స్ ఎవరో చెప్పుకొచ్చింది. అమరన్ సినిమాలో సాయిపల్లవి బెస్ట్ ఫర్మామెన్స్ ఇచ్చిందని చెప్పుకొచ్చింది. అలాటే నజ్రియా సూక్ష్మదర్శినిలో, అలియా భట్.. జిగ్రాలో.. అనన్య పాండే కంట్రోల్ లో అద్భుతంగా నటించారని సామ్ వీడియోలో చెప్పుకొచ్చింది.
https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/3574244587743183373/






