నటిగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి.. స్టార్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

నటిగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి.. స్టార్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె స్టార్ట్ చేసిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన లేటెస్ట్ మూవీ ‘శుభం’ (Shubham). ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మే 9న గ్రాంగ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు ఇందులో నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌కు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత నిర్మాతగా తన ప్రయాణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘15 ఏళ్ల నా కెరీర్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆ అనుభవంతోనే నిర్మాతగా మారను. నాకు మంచి టీమ్ దొరికింది. సినిమాలో భాగమైనప్పుడు నటిగా కంటే నిర్మాతగా ఎక్కువ బాధ్యతలు ఉంటాయని తెలుసుకున్నాను. ‘శుభం’ షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్‌గా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇంకా మరెన్నో తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఒకే రకమైన కథలకు పరిమితం కావాలని నేను అనుకోవడం లేదు. డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్‌లో కథలు చేయాలని అనుకుంటున్నారు.. ఎన్నో కథలు వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మహిళగా నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటి సినిమాలు నిర్మించాలని నిర్ణయించుకున్నాను. ఫైనల్‌గా రిస్క్ తీసుకోకుండా అభివృద్ధిని ఆశించలేం. నాకు సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టం. ఎన్నో రిస్కులు తీసుకుని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను’. అంటూ చెప్పుకొచ్చింది.

Next Story