Samantha: మరో వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ చిత్రంలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది.

Samantha: మరో వ్యాధితో బాధపడుతున్న సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ చిత్రంలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పట్టుమని 4 సంవత్సరాలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకుల తర్వాత నాగ చైతన్య స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్ చేస్తూ రీసెంట్‌గా మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. కానీ, సామ్ మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా ఈ బ్యూటీ ఆఫ్టర్ డివోర్స్ మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడి సినిమాలకు దూరమైంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటూ రీసెంట్ సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ ఫొటోలు, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సమంత తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో బ్యాక్ నుంచి వర్క్ అవుట్ చేస్తున్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పులు నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటాయి’ అని సాడ్ ఎమోజీ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతూ, సమంత తొందరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story