Samantha: పాపిట బొట్టుతో దర్శనమిచ్చిన సమంత.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-14 08:12:31  IST  )

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Samantha: పాపిట బొట్టుతో దర్శనమిచ్చిన సమంత.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.

విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)ను రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో చాలా రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన కొన్ని పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న ఫొటోస్‌లో సామ్ పట్టు చీరలో సంప్రదాయకంగా కనిపించింది. జడ అల్లుకొని, పూలు పెట్టుకుని నగలతో చాలా అందంగా కనిపించింది. అయితే పాపిట కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవడంతో ఈ ఫొటోస్ చాలా విశేషంగా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు వావ్ చాలా క్యూట్‌గా ఉన్నారు సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read..

మరో వివాదంలో మృణాల్ ఠాకూర్..

Next Story