Samantha: బికినీలో దర్శనమిచ్చిన సమంత.. సో హాట్ అంటూ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-08-11 04:49:18  IST  )

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Samantha: బికినీలో దర్శనమిచ్చిన సమంత.. సో హాట్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.

కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య గత ఏడాది స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala)ను పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. ప్రెజెంట్ ఓ పక్క నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తోంది. అలాగే సినిమాల్లోను యాక్ట్ చేస్తుంది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో సామ్ బికినీలో దర్శనమిచ్చింది. బాటిల్ గ్రీన్ కలర్ బికినీ, బ్లాక్ గాగూల్స్, హెయిర్ లీవ్ చేసుకుని కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు అవి ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ అని కొంతమంది అంటుంటే మరికొంత మంది సో హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story