సమంత పెళ్లిలో ట్విస్ట్‌..."భూత శుద్ధి వివాహం" స్టోరీ ఇదే !

by velandi.Saikiran |

రాజ్ నిడిమోరు, సమంత ఇద్దరు కూడా 'భూత శుద్ధి వివాహం' చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవు

సమంత పెళ్లిలో ట్విస్ట్‌...భూత శుద్ధి వివాహం  స్టోరీ ఇదే !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారు ఉండరు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార సమంత, ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న హీరోయిన్ సమంత, ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి అగ్రశ్రేణి హీరోయిన్ గా మారిపోయారు. అయితే అలాంటి సమంత పర్సనల్ లైఫ్ చాలా అస్తవ్యస్తంగా తయారైన సంగతి తెలిసిందే.

మొదటి భర్త అక్కినేని నాగ చైతన్య విడాకులు ఇవ్వగా, చాలా రోజులు సింగిల్ లైఫ్ లీడ్ చేసింది. అయితే ఇప్పుడు నాగచైతన్య తరహాలోనే రెండో వివాహం చేసుకుంది. పెళ్లి చాలా రహస్యంగా జరిగినప్పటికీ, సమంత మాత్రం సోషల్ మీడియాలో పెళ్లి ఫోటోలు పెట్టి అధికారికంగా ప్రకటించింది. దీంతో సమంతకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారు అభిమానులు. అయితే ఈ పెళ్లిపై తాజాగా ఓ న్యూస్ వైరల్ గా మారింది.

రాజ్ నిడిమోరు, సమంత ఇద్దరు కూడా 'భూత శుద్ధి వివాహం' చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతాయట. ఆలోచనలు, భావోద్వేగాలు, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన పవిత్ర కార్యక్రమమే ఈ 'భూత శుద్ధి వివాహం' అని చెబుతున్నారు. లింగ భైరవి ఆలయాలలో లేదా ఎంపిక చేసిన ప్రత్యేక ప్రదేశాల్లో ఈ వివాహ వేడుకను నిర్వహిస్తారు. దాంపత్య ప్రయాణంలో సామరస్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని కూడా ప్రసాదిస్తుందట. అందుకే కొత్త తరహాలో సమంత జంట ఈ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story