భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు... సమంత సంచలనం?

by velandi.Saikiran |   (  Updated:2025-08-01 11:38:33  IST  )

టాలీవుడ్ హీరోయిన్ సమంత ( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భర్తకు దూరమై ప్రస్తుతం ఒంటరిగా లైఫ్

భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు... సమంత సంచలనం?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత ( Samantha ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భర్తకు దూరమై ప్రస్తుతం ఒంటరిగా లైఫ్ గడుపుతున్న హీరోయిన్ సమంత... వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. బాలీవుడ్ అలాగే టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలలో.. అదిరిపోయే సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తోంది సమంత. అనారోగ్యం ( Un Healthy) పాలైనా కూడా... ఎక్కడ తగ్గడం లేదు. అయితే తాజాగా... హీరోయిన్ సమంత చేసిన ఓ పని కాంట్రవర్సీకి దారితీసింది.

ఆమె సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కు లైక్ కొట్టడమే ఇప్పుడు.. హాట్ టాపిక్ అయింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికి భర్తలు చూస్తూ ఉంటారని ఓ సర్వే గురించి సోషల్ మీడియాలో పోస్ట్ వచ్చింది. వెంటనే ఆ పోస్ట్ ను హీరోయిన్ సమంత లైక్ చేయడం.... వివాదంగా మారింది. సక్సెస్ వేర్స్ అనే ఇనిస్టా ( Success Wears Insta ) అకౌంట్ నుంచి ఆరోగ్యం అలాగే అనుబంధం, కుటుంబానికి సంబంధించిన స్పెషల్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి. వాటిని మొదటి నుంచి ఫాలో అవుతున్న సమంత... అందులో హెల్త్ టిప్స్ కూడా పాటిస్తుంది. ఈ నేపథ్యంలోనే... భార్యా భర్తల గురించి ఆ సంస్థ చేసిన ఓ పోస్ట్ ను లైక్ కొట్టింది సమంత.

భార్య తీవ్ర అనారోగ్యానికి గురైతే భర్త ఆమెను వదిలించుకోవడానికి ఇష్టపడుతున్నాడని... కానీ భార్య మాత్రం అలాగే సంసారం చేస్తోందని ఇందులో పేర్కొన్నారు. సర్వే చేస్తే కూడా... భార్య కాస్త ఓపికగా ఉంటూ భర్తతో... కాపురం చేస్తుందని తేలిందట. దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టడంతో వెంటనే సమంత లైక్ కొట్టింది. సమంతతో పాటు దాదాపు 60 వేల మందికి పైగా... ఆ పోస్టును లైక్ చేశారు. ఇది వైరల్ కావడంతో... అక్కినేని నాగచైతన్య పై ( Akkineni naga chaitanya) దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. సమంతకు మయోసైటీస్ అనే భయంకరమైన వ్యాధి వచ్చిన నేపథ్యంలోనే... నాగచైతన్య ఆమెను విడిచి పెట్టాడని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే తాజాగా వచ్చిన సర్వేను ఆమె లైక్ కొట్టిందని చెబుతున్నారు సమంత అభిమానులు.

Video Link

Next Story