భవిష్యత్తు ప్రణాళికలేంటో చెప్పేసిన సమంత

by Muthe.Rajitha |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల డైరెక్టర్ రాజ్ నిడమనూరును రెండో పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది.

భవిష్యత్తు ప్రణాళికలేంటో చెప్పేసిన సమంత
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల డైరెక్టర్ రాజ్ నిడమనూరును రెండో పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. అయితే వివాహం అనంతరం సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. రాబోవు 2026 ఏడాదిలో తన భవిష్యత్తు ప్రణాళికలను ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకుంది. భవిష్యత్తులో బయట ప్రపంచపు ఒత్తిడి కంటే తన అంతరాత్మను ఎక్కువగా వినాలని, జీవితాన్ని కృతజ్ఞతతో ముందుకు నడిపించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీర్ఘకాలం ఆరోగ్యంగా, శారీరకంగా బలంగా ఉండేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం, తొందరపాటు విజయాలకన్నా స్థిరమైన పని ద్వారా నెమ్మదిగా అయినా పైకి ఎదగాలని భావిస్తునట్టు పేర్కొంది.

వ్యక్తిగత జీవితంలో పైపై సంబంధాలకంటే, నిజమైన అనుబంధాలను కోరుకుంటున్నట్టు తెలిపింది. సొసైటీలో తనకు లభించిన స్థానం, ప్రేమకు ప్రతిఫలంగా సమాజానికి తిరిగి ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆమె ప్రణాళికల్లో భాగంగా చేర్చుకున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా, తన జీవిత లక్ష్యానికి అనుగుణంగా, అర్థవంతమైన ప్రయాణాన్ని ఎంచుకుంటానని సమంత చెబుతోంది. కాగా ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు సమంతకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

Next Story