పెళ్లైన మరుసటిరోజే సమంత రాజ్ హనీమూన్.. ఫోటోలు వైరల్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

పెళ్లైన మరుసటిరోజే సమంత రాజ్ హనీమూన్.. ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట డిసెంబర్ 1వ తేదీన పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కాగా పెళ్లి చేసుకున్న మ‌రుస‌టి రోజే ఈ జంట హనీమూన్ బ‌య‌లుదేరారు. రాజ్ స‌మంత శంషాబాద్ విమానాశ్ర‌యంలో క‌నిపించ‌గా వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. కాగా వీరు హ‌నీమూన్ కోసం గోవా వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

దీంతో కొత్త‌జంట‌కు నెటిజ‌న్లు హ్యాపీ మ్యారేజ్ లైఫ్.. ఎంజాయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే స‌మంత‌కు గ‌తంలో నాగ‌చైత‌న్య‌తో పెళ్లి జ‌ర‌గ్గా వీరిద్ద‌రూ 2021లో విడాకులు తీసుకున్నారు. త‌ర‌వాత నాగాచైత‌న్య శోభిత‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు. ఇక ఇప్పుడు స‌మంత సైతం రాజ్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అయితే రాజ్ కు ఇప్ప‌టికే పెళ్లై విడాకులు తీసుకోవ‌డంతో స‌మంత‌పై కొంత‌మంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Next Story