- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సమంత- రాజ్.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ ఫొటో
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది.
కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని మనందరికీ తెలిసిందే. ఈ జాతరకు భక్తులు అమ్మవార్లకు బంగారం(బెల్లం)సమర్పించుకుంటారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లి అయిన సమంత-రాజ్ నిడిమోరు కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నట్లు ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. సమంత పసుపు పచ్చ చీర కట్టుకొని ఉండగా రాజ్ మాత్రం వైట్ కలర్ ధోతిలో ఉన్నాడు. ఇక వీరిద్దరిపై పసుపు కుంకుమ పడి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. ఇది ఏఐ ఫొటో అని కామెంట్స్ చేస్తున్నారు.






