- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతంలో కంటే భిన్నంగా మారిపోయిన సమంత.. ఇన్నర్స్ కనిపించేలా ఫొటో షూట్
మరో రెండు రోజుల్లో (జనవరి 24) వరల్డ్ పికెల్ బాల్ లీగ్ (World Pickleball League) స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: మరో రెండు రోజుల్లో (జనవరి 24) వరల్డ్ పికెల్ బాల్ లీగ్ (World Pickleball League) స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. వరల్డ్ పికెల్ బాల్ లీగ్‌లో చెన్నై సూపర్ ఛాంప్స్ ఫ్రాంచైజీ(Chennai Super Champs Franchise)ని స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కొలుగోలు చేసింది. దీంతో ఆ టీమ్‌కు సమంత సపోర్ట్‌గా ఉంటూ యజమానిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే చెన్నైలోని సత్యభామ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్(Satya Bhama Institute of Science and Technology)లో స్పెషల్ ఈవెంట్‌ను నిర్వహించి తన జట్టుకు సంబంధించిన కొత్త జెర్సీని లాంచ్ చేసింది సామ్. రెడ్, ఎల్లో కలర్ కాంబినేషన్‌లో ఈ జెర్సీ డిజైన్ చేయబడి ఉండగా.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘పికిల్‌బాల్ ఫీవర్ విపరీతంగా పెరుగుతోంది.. టోర్నమెంట్ జనవరి 24న ప్రారంభం కానుండగా, చెన్నై ఫ్రాంచైజీకి గర్వకారణమైన యజమానిగా ఇది అద్భుతమైన ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను. ఇది విజయాలు అండ్ గర్వంతో నిండిన అసాధారణ అధ్యాయానికి నాంది పలుకుతుంది. ట్రోఫీని ఇంటికి తీసుకురావడానికి అండ్ చెన్నైని వేరే లెవల్‌కి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు చెన్నై సూపర్ చాంప్స్.. ఆల్ ది బెస్ట్ టీమ్ సూపర్ ఛాంప్స్’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఫొటోస్‌లో సామ్ గతంలో కంటే భిన్నంగా కనిపిస్తూ.. ఇన్నర్స్ కనిపించేలా వైడ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చి అందరిని ఆకట్టుకుంటోంది.






