పెళ్లి త‌ర్వాత స‌మంత మ‌రో షాకింగ్ నిర్ణ‌యం !

by velandi.Saikiran |

దీంతో సమంత-రాజ్ నిడిమోరు హనీమూన్ క్యాన్సల్ అయిందని అంటున్నారు. కెరీర్ పైన దృష్టి పెట్టేందుకు

పెళ్లి త‌ర్వాత స‌మంత మ‌రో షాకింగ్ నిర్ణ‌యం !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో వివాహం చేసుకున్న తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు, హీరోయిన్ సమంత హనీమూన్ వెకేషన్ కు వెళ్తానని అందరూ అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చింది ఈ జంట. తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టేందుకు సమంత కీల‌క‌ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగానే షూటింగ్ కోసం మేకప్ అవుతున్న ఫోటోను తాజాగా షేర్ చేసింది. ఈ ఫోటోకు లెట్స్ డూ దిస్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది సమంత. అటు సెట్స్ లో ఉన్న ఫోటోలను కూడా పంచుకుంది. దీంతో సమంత-రాజ్ నిడిమోరు హనీమూన్ క్యాన్సల్ అయిందని అంటున్నారు. కెరీర్ పైన దృష్టి పెట్టేందుకు సమంత దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారట. కాగా సొంత నిర్మాణంలో సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇందులో ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story