- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maa Inti Bangaaram Trailer: నా ప్రాణం అడ్డుపెట్టైనా..ఫ్యామిలీకి ఏం కాకుండా చూస్కుంటా
సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 16 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోయిన్ గా ఆమె కొనసాగుతున్నారు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సమంత, విభిన్న కథలతో మెప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత, కొత్త సినిమాతో అభిమానుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమానే మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram).
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను స్వయంగా సమంత భర్త రాజ్ నిడిమోర్ నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 19వ తేదీన రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్ సమంత యాక్షన్ మూడ్ లో కనిపించారు. ఒకప్పటి విజయశాంతిలా ఫైట్స్ చేస్తూ అందరిని మెప్పించారు. హీరో అయినా, హౌస్ వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్ గా పడిందంటే ఎవ్వడైనా బెదరాల్సిందే అంటూ సమంత ఈ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా హైప్ ను అమాంతం పెంచేసింది.






