మహారాణి లుక్‌లో సూపరో సూపర్ అనిపిస్తున్న సమంత.. సమ్ము అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-09 15:51:25  IST  )

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

మహారాణి లుక్‌లో సూపరో సూపర్ అనిపిస్తున్న సమంత.. సమ్ము అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు.

విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో మహారాణిలా రెడీ అయింది.

దానికి తోడు ముక్కు పుడక పుట్టుకుంది అది ఆమె అందానికే వన్నె తెచ్చిపెట్టింది. నుదుటున ఆ ఎర్రటి బొట్టు ఆ మేకప్ అబ్బో అదిరిపోయింది. ఇక వాటికి ‘సమ్ము’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపరో సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

READ MORE ...

వావ్.. సూపర్ లుక్‌లో అక్కడ దర్శనమిచ్చిన చైతన్య- శోభిత.. నెట్టింట ఆకట్టుకుంటున్న వీడియో




Next Story